UPDATES  

 ప్రేమ పేరుతో మోసం చేసిన కానిస్టేబుల్

 

 

కులం పేరుతో వేధిస్తున్న అత్త మామ.

న్యాయం కావాలంటూ పోలీసుల ఆశ్రయించిన స్వప్న

మన్యం న్యూస్ వాజేడు

న్యాయం కొరకు పేరూరు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన కానిస్టేబుల్ భార్య స్వప్న వివరాల ప్రకారం
కావేరి సంజయ్ ధర్మవరం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానిస్టేబుల్ పాకాల కొత్తగూడెం మండలం, సాదిరెడ్డిపల్లి గ్రామంకు చెందిన ఈసం స్వప్న తో ప్రేమాయణం సాగించారు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నారు. పాప పుట్టిన తర్వాత నా భర్త కావేరి సంజయ్ నచ్చలేదంటూ, వేధిస్తున్నాడని స్వప్న మీడియాను ఆశ్రయించింది. మూడు సంవత్సరాల ప్రేమకు ప్రతిరూపంగా పాప పుట్టిన రెండు సంవత్సరాలకు, చిత్రహింసలతో హింసించడం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఏదో ఒక వంకతో అరెస్ట్మెంట్ చేస్తున్నాడని, విడాకులు కావాలని పలుమార్లు కొట్టారని, స్వప్న మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్త కావేరి సంజయ్ గత వారం రోజుల క్రితం అత్తగారింట్లో దిగపెట్టి కొత్తగూడెం వెళ్లారు. ఆ రోజు నుండి అత్తమామలు,ఆడపడుచులు బావ, తోటి యారాళ్ళు, మా ఇంట్లో ఉండవద్దని, ఇంటికి తాళం వేసి, కోయ దానివంటూ, కులం పేరుతో దూషిస్తున్నారని,వంట చేసుకోవడానికి నిత్యవసర సరుకులతో పాటు, ఇంట్లో కనీసం ఉండడానికి కూడా స్థానం కల్పించకపోవడంతో,స్వప్న తనకు న్యాయం చేయాలని పేరూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్సైకి ఫిర్యాదు చేయడంతో భర్త, అత్తమామలు,ఎవరికి చెప్పిన మాకు ఏమి కాదని బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీస్ శాఖ వారు తమకు తమ బిడ్డకు, రక్షణ కల్పించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !