UPDATES  

 హద్దు దాటితే రద్దె ఆర్ఎంపీలను హెచ్చరించిన మండల వైద్యాధికారి రాకేష్ కుమార్ మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 21, గ్రామీణ ప్రాంతాలలో వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలు వారి పరిధి మేరకే రోగులకు చికిత్సను అందించాలని, హద్దు దాటి వైద్యం చేయవద్దని, ఒకవేళ అలా ఎవరైనా చేసినట్లయితే వారి గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రామీణ వైద్యుల సమావేశం మండల వైద్యాధికారి డాక్టర్ రాకేష్ కుమార్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిధి మించి వైద్యం చేయవద్దని, ఒక్క రోజు కంటే ఎక్కువ జ్వరం ఉంటే పై ఆసుపత్రికి రిఫర్ చేయాలని, రోగులకు అతిగా యాంటీబయాటిక్స్ ఇవ్వద్దని సూచించారు. సూచనలు పాటించకుండా హద్దు దాటిన వారి గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఆర్ఎంపీ వైద్యులు పాల్గొన్నారు.

హద్దు దాటితే రద్దె

ఆర్ఎంపీలను హెచ్చరించిన మండల వైద్యాధికారి రాకేష్ కుమార్

మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 21, గ్రామీణ ప్రాంతాలలో వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలు వారి పరిధి మేరకే రోగులకు చికిత్సను అందించాలని, హద్దు దాటి వైద్యం చేయవద్దని, ఒకవేళ అలా ఎవరైనా చేసినట్లయితే వారి గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రామీణ వైద్యుల సమావేశం మండల వైద్యాధికారి డాక్టర్ రాకేష్ కుమార్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిధి మించి వైద్యం చేయవద్దని, ఒక్క రోజు కంటే ఎక్కువ జ్వరం ఉంటే పై ఆసుపత్రికి రిఫర్ చేయాలని, రోగులకు అతిగా యాంటీబయాటిక్స్ ఇవ్వద్దని సూచించారు. సూచనలు పాటించకుండా హద్దు దాటిన వారి గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఆర్ఎంపీ వైద్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !