మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండాలక్ష్మణ్ చిత్రపటానికి చరిత్రశాఖ వారి ఆధ్వర్యంలో ఘననివాళులు అర్పించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పోలారపు పద్మ మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరంలో మారుమూల ప్రాంతంలో జన్మించి ఉన్నతవిద్య అభ్యసించి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై జరిగిన మూడుతరాల ఉద్యమానికి వారది అని, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి కొండాలక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జి.శేఖర్, వైస్ ప్రిన్సిపల్ బిందుశ్రీ , ఐక్యూయేసి కోఆర్డినేటర్ కిరణ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు, చెంచురత్నయ్య, ఇంద్రాణి, సరిత, రాజు తదితరులు పాల్గొన్నారు.
