మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని ఇల్లందు ఎంపీడీవో కార్యాలయం నందు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా నూరుశాతం రాయితీపై ఉచిత చేపపిల్లల పంపిణి కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు ఉచిత చేపపిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలోని అనివర్గాల ప్రజల అభ్యున్నతికై పాటుపడుతున్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోమారు గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఎంపీపీ చీమల నాగరత్నం, ఎంపీడీవో బాలరాజు, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, మండల కోఆప్షన్ గాజి, జిల్లా మత్స్యశాఖ అధికారి వీరన్న, ఈఆర్డీఓ చిరంజీవి, ఇంద్రనగర్ వార్డుసభ్యులు నీలం రాజశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.