నేటి బాలలే…రేపటి పౌరులు :- ఎస్ఐ రాజకుమార్.
మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- బూర్గంపహాడ్ స్థానిక ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో గురువారం పలు అంశాలపై ఎస్ఐ రాజ్ కుమార్ విద్యార్థులకు పలు సూచనలు,సలహాలు చేశారు.ముందుగా విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి ప్రతిభను పరీక్షించారు. అనంతరం ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యార్థి దశ నుండే సేవా భావం,క్రమశిక్షణ,సమాజంపై అవగాహన కలిగి ఉండాలని,తమ పాఠశాలలో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలోనూ,ప్రజలను సమాజ సేవపై చైతన్య పరచడంతో పాటు సమాజ సేవను తమ సేవగా భావించే భావజాలం విద్యార్థి దశ నుండి అలవర్చుకోవాలని.ప్రధానంగా గురువులను గౌరవించడం నేర్చుకుంటేనే మీ ఉజ్వల భవిష్యత్తుకి మార్గం ఉంటుంది అని,లేని పక్షంలో మీ జీవిత రాతలు మీరు రాసుకున్న వారు అవుతారు అని గురువు తల్లిదండ్రులలో సమానం అని తెలిపారు,నేటి బాలలే రేపటి పౌరులు అనే విషయాన్ని విద్యార్థులకు వివరించి చెప్పారు,చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి అని తెలిపారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్సన్ మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ వాడకానికి దూరంగా ఉండాలి అని,పాఠశాలలో విద్యార్థులు చెడుఅలవాట్లకు,చేడు సావాసాలకు దూరంగా ఉండాలని ప్రధానంగా ఉపాధ్యాయులకు మర్యాదలు ఇస్తూ తోటి విద్యార్థులతో కలిసి,మెలిసి మెలగాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్ఐ సత్యనారాయణ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేసి విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వంట అక్కలు చేసిన మధ్యాహ్న నన్యమైన భోజనాన్ని చూసి వారిని అభినందించి వరికి కొంత నగదు బహుమానం చేశారు,గతంలో 10వ తరగతి పరీక్షల ముందు విద్యార్థులకు పరీక్షా ఫ్యాడులు,జామెంట్రీ బాక్సులు అదే విధంగా పది పరీక్షల్లో ఉత్తమ ఫలితం సాధించిన విద్యార్థికి అరుదైన బహుమానం కూడా అందించిన విషయం విధితమే.ఈ కార్యక్రమంలో బూర్గంపహడ్ ఎస్సై రాజకుమార్,ఏఎస్ఐ సత్యనారాయణ,ప్రధానోపాధ్యాయులు జాన్సన్ ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.