ప్రియమణిని ఓ నెటిజన్ ఆంటీ అని సంబోధించాడు. దీనిపై ప్రియమణి షాకింగ్ రిప్లయ్ ఇచ్చింది. ఇలాంటి కామెంట్లను తాను లైట్ గా తీసుకుంటానని చెపుతూనే సదరు నెటిజన్ పై మండిపడింది. తనను ఆంటీ అని పిలవడాన్ని తాను పట్టించుకోనని చెప్పింది. వయసు పెరిగితే సిగ్గు పడాల్సిన అవసరం లేదని తెలిపింది. వయసు పెరగడం అనేది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ అని చెప్పింది.