గద్దర్ జహీర్ స్మారక స్ఫూర్తి సదస్సుకు వేలాదిగా తరలి రావాలి
* ప్రజా ఉద్యమాలకు సదస్సును ప్రేరణగా నిలుపుతాం
* విలేకర్ల సమావేశంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: కొత్తగూడెం క్లబ్బులో 24న జరిగే గద్దర్, జహీర్ స్మారక స్ఫూర్తి సదస్సుకు ప్రజలు, ప్రజాస్వామ్య లౌకిక వాదులు మేధావులు వేలాదిగా తరలి రావాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు సదస్సు నిర్వాహకులు కోరారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవం నందు శనివారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తమ తుది శ్వాసవరకు ఆట పాట మాట రచనలతో ప్రజలను చైతన్యవంతం చేస్తూ తమకు జరుగుతున్న అన్యాయాలలపై అకృత్యాలపై దోపిడీ పీడనలపై ప్రశ్నించే నిలదీసే తత్వాన్ని నేర్పిన మహోన్నత వ్యక్తులు గద్దర్ జహీర్ అని పేర్కొన్నారు. ఈ సదస్సును వేదికగా చేసుకొని ఏజెన్సీ ప్రాంతాలకు కార్మిక శ్రామిక వర్గాలకు నెలవై వున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజానీకానికి ప్రేరణ కల్పించే లక్ష్యంతో లౌకిక ఆలోచన వైపు నడిపించేందుకు సదస్సును
వేదికగా చేసుకొని అమరుల ఆశయాల సాధనకు ప్రతినబునెందుకు జిల్లా స్థాయి స్మారక స్ఫూర్తి సదస్సు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. సదస్సుకు ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, సిపిఐ జిల్లా కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, వీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొఫెస్సర్ కోదండరాం, న్యూ డెమెక్రసీ రాష్ట్ర నాయకులు సాదినేని వెంకటేశ్వరరావు, ఆవునూరి మధు, ఆత్మీయ అతిధులుగా ప్రొఫెసర్లు కంచె ఐలయ్య, ఖాసీం, డాక్టర్ వెన్నెల, జయరాజు, అందె శ్రీ, పాశం యాదగిరి తదితరులు పాల్గొంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర జిల్లా గాయకులు రచయితలచే కళాకారులచే ఆటా పాట మాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు ఎస్ కే సాబీర్ పాషా, అన్నవరపు కనకయ్య, నిర్వహణ కమిటీ కన్వీనర్ జేబీ శౌరి, టిజెఎస్ జిల్లా నాయకులు తాళ్లూరి వెంకటేశ్వర్ రావు, మల్లెల రామనాధం, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు కూసపాటి శ్రీనివాస్, బత్తుల కృష్ణయ్య, కల్లోజి శ్రీనివాస్, సుగుణారావు, రత్న, వై.శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి శ్రీనివాస రావు, గడ్డం రాజశేఖర్, కె రత్నకుమారి, వెంకట్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.





