హిందీలో రష్మిక చేసిన ‘యానిమల్’ డిసెంబర్ 1వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రష్మిక లుక్ ను వదిలారు. రష్మిక చీరకట్టులో హోమ్లీ లుక్ తో ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకి సందీప్ వంగా దర్శకత్వం వహించాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన జోరు పెరగడం ఖాయమనే నమ్మకంతో రష్మిక ఉంది.