800 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ: ఎమ్మెల్యే వనమా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈనెల 25వ తేదీన పాత కొత్తగూడెంలో 800 మంది పేదలకు ఇల్లు స్థలాలు పంపిణీ చేయనున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా అధికారులను వెంటబెట్టుకొని పాత కొత్తగూడెంలోని డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పక్కన గల 25 ఎకరాల స్థలాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పేద వాడికి సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేసే 75 గజాల స్థలాన్ని ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు.
28 ఎకరాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన లేఅవుట్ చేసి మార్కింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రతి పేదవారిని ఆదుకుంటామన్నారు. ఈనెల 25న ఉదయం 9 గంటలకు కొత్తగూడెం క్లబ్ కి లబ్ధిదారులు రావాలని పిలుపునిచ్చారు.
కొత్తగూడెం క్లబ్బులో స్వయంగా తన చేతుల మీదుగా 800 మంది లబ్ధిదారులకు స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా వెంటే మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘు, ఎమ్మార్వో పుల్లయ్య, టీ పి వో ప్రభాకర్, కౌన్సిలర్లు సుజాత, పరమేష్ యాదవ్, కోలాపురి ధర్మరాజు, బిఆర్ఎస్ నాయకులు రజాక్, విజయ్, నాగరాజు అధికారులు, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





