మన్య న్యూస్ ,భద్రాచలం:
భద్రాచలంలోని సదాశివానంద ఆశ్రమంలో ప్రతిష్టించిన గణనాథుడి వద్ద శనివారం నిర్వహించిన పూజా కార్యక్రమంలో పిన్నింటి సత్యాలక్ష్మి భక్తురాలు కొట్టిన కొబ్బరికాయలో నాలుగు పలకలు గల కొబ్బరి చిప్పలు దర్శనమిచ్చాయి. ఇలా వింతగా ఉన్న నాలుగు చిప్పల కొబ్బరికాయను భక్తులు ఆశ్చర్యంగా చూశారు.వింత కొబ్బరికాయగురించి వినాయకుడి మహిమ గా భక్తులు మాట్లాడుకోవడం జరిగింది.