మన్యం న్యూస్ చర్ల;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామంలో పూజారి ఆదిలక్ష్మి అనే మహిళకు కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా కాళ్లు చచ్చిపోడిపోయాయి. తన వద్ద ఉన్న డబ్బులతో వైద్యం చేయించుకోగా మెరుగైన వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు కారణంగా దాతలను ఆశ్రయించడం జరిగింది. దాతల సహకారంతో 26,800 రూపాయలను గొమ్ముగూడెం సర్పంచ్ పొడెయం మురళి చేతుల మీదుగా పూజారి ఆదిలక్ష్మికి అందించడం జరిగింది. ఇందుకు సహకరించిన దాతలు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు సర్పంచ్ తెలియజేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ గ్రామంలోని కడు పేదవారికి ఆరోగ్య, కూడు, గుడు వంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో అందరూ సహకరిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొడియం మురళి, పోట్రు బ్రహ్మానంద రెడ్డి, దినసర భాస్కర్ రెడ్డి, సంక పాప ప్రభాకర్, పూజారి రమణ, పంచాయతీ సెక్రెటరీ బి. శోభన్ బాబు, తడికల వెంకటేశ్వర్లు, సొంతపురి సతీష్ తదితరులు పాల్గొన్నారు.





