మన్యం న్యూస్ చండ్రుగొండ,సెప్టెంబర్ 23 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ అశ్వరావుపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను నిరంతరం ప్రజల్లో మమేకమవుతూ శనివారం మండల కేంద్రంలో జోరుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అని, బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన కుటుంబ పాలనని, ధరణి పోర్టల్ పై చిన్న కారు, సన్న కారు రైతులు విషయంలో ప్రభుత్వం విఫలమైందని, రైతుబంధు కూడా వేల ఎకరాల ఉన్న వ్యక్తులకు ఉపయోగపడేలా ఉందని, ప్రభుత్వం ఏర్పడిన నుండి రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తుందని, పూర్తిస్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఎంతో మంది యువత ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయని, ఎన్నికలు వస్తున్నాయని ప్రభుత్వం గృహలక్ష్మి పథకం మూడు రోజుల్లో కాలవ్యవధిలో దరఖాస్తు స్వీకరణ ముగించిందని, దీనివల్ల నిరుపేదలకు ఉపయోగపడే విధంగా గృహలక్ష్మి పథకం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లమోతు రమణ, పొనబోయిన బిక్షమయ్య, కేశబోయిన నరసింహారావు, దారావత్ రామారావు, దారం గోవిందరెడ్డి, అంతటి రామకృష్ణ, చాపలమడుగు మనోహర్, బొర్రా సురేష్, రెడ్డిపోగు సురేష్, సర్పంచ్ పద్దం వినోద్, సంకా కృపాకర్ ,తదితరులు పాల్గొన్నారు.