మన్యంన్యూస్,ఇల్లందు:జీతాల పెరుగుదల, న్యాయపరమైన పలు అంశాలపై అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి పదమూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇల్లందు తహశీల్దార్ ఆఫీస్ ముందు అంగన్వాడిలు చేస్తున్న నిరవాదిక సమ్మెకు బీఎస్పీ పార్టీ నాయకులు మద్దతు పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ బీఎస్పీ ఇంచార్జి బాధావత్ ప్రతాప్ మాట్లాడుతూ..శిశువు జన్మించిన నాటినుంచి కొన్ని సంవత్సరాల వరకు అంగన్వాడి బడి, అంగన్వాడి టీచర్లు, ఆయాలే మనకి మొదటి గురువులని అన్నారు. పిల్లలకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి ఎదుగుదలలో కీలకపాత్ర పోషించి నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అన్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కలిస వేతనం ఇరవైఆరు వేలరూపాయలు ఇవ్వాలన్నారు. అంగన్వాడీల న్యాయపరమైన అన్ని డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకు వారి పోరాటానికి బీఎస్పీ అండగా ఉంటుందని ప్రతాప్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా కార్యదర్శులు లేతాకుల కాంతారావు, జిల్లా నాయకులు రాయల శ్రీనివాసరావు, పప్పుల గోపీనాథ్, మండల నాయకులు అజ్మీర వెంకన్న, రాంప్రసాద్, లోకేష్, సిఐటియు అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, ఫాతిమా, రాంబాయి
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు మమత, వసంత, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.