ఎంపీపీ రేగా కాళిక సత్యనారాయణ దంపతుల అన్నదాన కార్యక్రమం
*అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎంపీపీ రేగా కాళిక సత్యనారాయణ దంపతులు.
మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని సమత్ బట్టుపల్లి గ్రామపంచాయతి లోని తన గ్రామమైన కొర్నవల్లి గ్రామంలో 6వ రోజు శనివారంవరాసిద్ధి వినాయక ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎంపీపీ రేగా కాళిక సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు. కరక గూడెం మండల ఆయు ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండే విధంగా చూడాలని ఆ సిద్ది వినాయకుడిని వేడుకున్నట్లు ఎంపీపీ దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.





