సీఎంపిఎఫ్, లెక్కలు తేల్చండి
రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి
మన్యం న్యూస్,ఇల్లందు:సింగరేణి ప్రగతిశీల కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, పిఎస్సిడబ్ల్యూయు రాష్ట్రకమిటీ పిలుపులో భాగంగా శనివారం స్థానిక జెకె సివిల్ డిపార్ట్మెంట్ మస్టర్ అడ్డావద్ద
సివిల్ డిపార్ట్మెంట్ అధికారికి యాకూబ్ షావలి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రఅధ్యక్షులు యాకుబ్ షావలి మాట్లాడుతూ..సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు గతనాలుగు సంవత్సరాల నుండి సీఎంపిఎఫ్ లెక్కలు చూపడంలేదన్నారు. ఒకే కుటుంబం, ఓకే గమ్యం, ఓకే లక్ష్యం అన్న నినాదం పచ్చి బూటకమేనని ఎద్దేవా చేశారు. సీఎంపీఎస్ వివరాలను కార్మికులకు చూపెట్టాలన్నారు.అదేవిధంగా పండగలకు, జాతీయ పండగలకు మస్టర్ తో కూడిన సెలవును కాంట్రాక్ట్ కార్మికులకు కల్పించాలన్నారు. 2013 నుండి హెచ్పిసి వేతనాలు పదిసంవత్సరాల ఏరియర్స్ తో పాటు వేతనాలు అమలు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సమానపనికి సమానవేతనం లేదా మొదటి క్యాటగిరి వేతనం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు జిల్లానాయకులు మల్లెల వెంకటేశ్వర్లు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు మేకల శీను, చారి, వెంకన్న, తరుణ్, జగదీష్, సుజాత, సైదా, రాజేశ్వరి, మల్లికా, మాధవి, ఫాతిమా, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.