గడపగడపకు బీఆర్ఎస్.
పినపాక బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా ను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యం
*బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్
మన్యం న్యూస్, కరకగూడెం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావును భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యం అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్ అన్నారు. మండల పరిధిలోని పద్మాపురం, మొగిళితోగు గ్రామాలలో గడపగడపకు బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చెస్తున్నటువంటి అభివృద్ధి పనుల కు సంబంధించి రావుల.సోమయ్య గౌడ్,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు 40,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందాం అని పిలుపునిచ్చారు.ఈ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే రేగా కాంతారావు గెలుపు ఎవరు కూడా ఆపలేరని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పద్మపూరం సర్పంచ్ తాటి. సరొజని,వెంగళరావు,ఎండి యాకూబ్,మాజీ ఎంపీటీసి నిట్టా.ఏడుకొండలు,నిట్టా. ప్రభాకర్,కొలగని.పాపారావు,రామటెంకి.పూర్ణ చంద్రశేఖర్,ఈసం.నాగేశ్వరరావు, తొలెం.రామారావు తదితరులు పాల్గొన్నారు.