* రూ.4.85 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే హరిప్రియ* బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లెల రూపురేఖలు మారాయి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
మన్యం న్యూస్,ఇల్లందు: ఇల్లందు మండలంలోని పలు గ్రామపంచాయతీలలో రూ.4.85 కోట్లతో డీఏంఎఫ్టీ, ఎస్డిటీ నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని ధనియాలపాడు గ్రామపంచాయతీలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధుల నుంచి రూ.20 లక్షల అంచనావ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా డీఎంఎఫ్టీ నిధుల నుంచి 35లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఏడు అంతర్గత సిసిరోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ధనియాలపాడు గ్రామపంచాయతీలో 1.20 కోట్లతో ధనియాలపాడు రోడ్డు నుంచి ఒడ్డుగూడెం వరకు బీటీరోడ్డు నిర్మాణపనులకు శంకుస్థాపన చేయటం జరిగింది. నిజాంపేట గ్రామంలో రూ.5లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మూడు అంతర్గత సిసిరోడ్లను, కట్టుగూడెం గ్రామంలో 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మూడు అంతర్గత సిసిరోడ్లను, రేపల్లెవాడ గ్రామపంచాయతీలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధుల నుంచి రూ.20 లక్షల అంచనా వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణపనులకు ఎమ్మెల్యే హరిప్రియ శంకుస్థాపన చేశారు. అనంతరం అదే పంచాయతీలో 20 లక్షల అంచనావ్యయంతో నిర్మించిన నాలుగు అంతర్గత సిసిరోడ్లను, సీఎస్పీ బస్తి గ్రామపంచాయతీలో 80లక్షల అంచనావ్యయంతో నిర్మించిన పదిహేను అంతర్గత సిసిరోడ్లకు ప్రారంభోత్సవం చేయటం జరిగింది. అనంతరం 20 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పోలారం, మనిక్యారం పంచాయతీల్లో 75లక్షల రూపాయలతో పన్నెండు సీసీరోడ్లకు ఎమ్మెల్యే హరిప్రియ శంకుస్థాపనలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఇల్లందు మండల జడ్పిటిసి ఉమాదేవి, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, మెట్లకృష్ణ, పార్టీ మండల అధ్యక్షులు శీలంరమేష్, మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, మండల కోఆప్షన్ సభ్యులు గాజి, సొసైటీ డైరెక్టర్ లస్కర్, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.