నక్సలైట్ వ్యవస్థను నిర్మూలిద్దాం బంగారు భవితను నిర్మిద్దాం
*మావోయిస్టు పోస్టర్ విడుదల చేసిన సి ఐ రాజగోపాల్
మన్యం న్యూస్ చర్ల:నక్సలైట్ వ్యవస్థను నిర్మూలిద్దాం బంగారు భవితను నిర్మిద్దాం అని చర్ల సీఐ బీ. రాజ్ గోపాల్ అన్నారు.
ఆయన శనివారం మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకుల ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… పోస్టర్ లో ఉన్న మావోయిస్టు నాయకులు చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, మంగపేట, తాడ్వాయి, కరకగుడెం,బయ్యారం,గుండాల పలు మండలాల ఏరియా అడవులలో సంచరిస్తున్నరని నమ్మదగిన సమాచారం ఉందని తెలిపారు. మావోయిస్టుల సమాచారాన్ని తెలిపిన వారికి తగిన బహుమతులు ఇవ్వబడునని, సమాచారం తెలిపిన వ్యక్తుల విషయాలు గోప్యంగా ఉంచబడినని సీఐ అన్నారు. ఈ పోస్టర్లను మండలంలోని ప్రధాన సెంటర్లలో అంటించడం జరిగినది.ఈ కార్యక్రమంలో చర్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.