మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కెసిఆర్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసింది. దీనిలో భాగంగా హెల్త్ క్యాంపులు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించడం జరుగుతుంది. శనివారం మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ నిర్వహించిన పోషణ మాసం ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భిణి మహిళలు ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలపై ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా గర్భిణి మహిళలకు సీమంతం నిర్వహించి గర్భిణీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత, జడ్పి సీఈవో విద్యాలత, ఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, అన్ని ప్రాజెక్టుల సిడిపిఓలు, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలను శాలువా బొకే లతో ఘనంగా సన్మానించారు.