UPDATES  

 స్కాలర్షిప్ బకాయిలను చెల్లించాలి

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జె.పద్మ డిమాండ్ చేశారు.
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని కోరుతూ శనివారం స్థానిక సింగరేణి చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఒక్క రోజు దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ దీక్షను సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పద్మ ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన 5,177 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. 2022-23 విద్యా సంవత్సరం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదనీ సుమారుగా 15 లక్షల మంది విద్యార్థుల చదువులపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువ వడ్డీరేట్లు తో రుణాలు తెచ్చి పిల్లలను చదివించాల్సిన పరిస్థితి దాపురించిందనీ, ఇంజినీరింగ్ మెడిసిన్ డిగ్రీ ఫార్మసీ లా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనీ, కోర్సు పూర్తయినా రీయింబర్స్మెంట్ రాకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తామని తెగేసి చెప్తున్నారనీ చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ తగు సమయంలో చెల్లించక రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వ స్పందించి బకాయిలు చెల్లించాలని లేని పక్షంలో దశల వారి ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం, ఎస్ఎఫ్ఐ కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు రామ్ చరణ్, భవ్య, సాగర్, శివ, నవీన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !