UPDATES  

 విద్యార్థినిలు అత్యున్నత లక్ష్యాలను సాధించాలి

విద్యార్థినిలు అత్యున్నత లక్ష్యాలను సాధించాలి
* సమానత్వం ఇంటి నుండే మొదలవ్వాలి
* జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
జి.భానుమతి

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సమానత్వం అనేది ఇంటి నుండి మొదలవ్వాలని మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందున్న ఎక్కడో ఒక ఒకచోట వివక్షను ఎదుర్కొంటున్నారని న్యాయమూర్తి
జి.భానుమతి తెలిపారు. శనివారం బాలికల ఆశ్రమ పాఠశాల పడమటి నర్సాపురంలో జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి ముఖ్య అతిథిగ పాల్గొని ప్రసంగించారు. లింగ సమానత్వంలో పిల్లల వైఖరిని రూపొందించడంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తారని తెలిపారు. మహిళల హక్కులను ప్రోత్సహించే సామాజిక మార్పును తీసుకురావడానికి విద్యా అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటని అన్నారు. బాల్య వివాహలు చట్టరీత్యా నేరమని, చదువుకున్న వయసులో వివాహ బంధం పేరుతో బందనం చేస్తున్నారని అన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో చేర్చుకోవడం చట్టరీత్య నేరమని అలా పాల్పడినట్లయితే కఠిన చర్యలు ఉంటారని తెలిపారు. విద్యార్థినిలు అత్యున్నత లక్ష్యాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ క్రీడా కార్యదర్శి పిట్టల రామారావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పురుషోత్తంరావు, డిప్యూటీ కౌన్సిల్ నిరంజన్ రావు, సీనియర్ న్యాయవాదులు లక్కినేని సత్యనారాయణ, గాదే సునంద, మెండు రాజమల్లు, అసిస్టెంట్ కౌన్సిల్ జ్యోతి విశ్వకర్మ, జూలూరుపాడు సిఐ పెద్దన్నకుమార్, ఎస్సై, ఆశ్రమ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, కానిస్టేబుల్ ఉపేందర్, పఖిర, జూనియర్ న్యాయవాది రమేష్, పి.ఎల్.వి రాజమణి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !