UPDATES  

 ఆళ్లపల్లి ప్రగతి అదుర్స్

ఆళ్లపల్లి ప్రగతి అదుర్స్
* రేగన్న అడుగు పడింది.. పల్లె మారింది
* మండలంలో సిసి రోడ్లు డ్రైనేజీలు
* హై లెవెల్ బ్రిడ్జిలు రాకపోకలు సులువు
* నిర్మాణ దశలో కొత్తగా కస్తూర్బా హాస్టల్
* ప్రజల చేరువకు వైద్య విద్య సదుపాయం
* విప్ రేగ సేవల పట్ల.. ప్రజల ప్రశంసల జల్లు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈ పల్లెకు పోవాలంటే ఒకప్పుడు గిరిజన ప్రజలకు నరకం కనిపించేది.. ఇప్పుడు ఆ నరకం నుండి విముక్తి కలిగి సులువుగా పల్లె గ్రామానికి పోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఇది ఎలా సాధ్యమైందని అక్కడి వారిని కదిలిస్తే సీఎం కెసిఆర్ ప్రభుత్వం వల్ల.. మా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పుణ్యమేనని మాట్లాడడం విశేషం. అంతే కాకుండా ఈ ప్రాంతానికి రేగన్న సేవలు మరువలేనివని ఆళ్లపల్లి మండల ప్రజలు కొనియాడుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆళ్లపల్లి మండలం దశలవారీగా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వంలో పినపాక గ్రామం మండలంగా మారింది. అంతేకాకుండా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈ మండలంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. గత పాలకుల హాయంలో ఆళ్లపల్లి ప్రాంతం మట్టిరోడ్లతో ఉండేది. కనీస సౌకర్యాలు కూడా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆళ్లపల్లి మండలం అభివృద్ధిలో ముందుకు పోతుంది. ఎమ్మెల్యే రేగా కాంతారావు మండలంలో ఉన్న నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి అభివృద్ధి కావాల్సిన నిధులు తీసుకొచ్చి హై లెవెల్ బ్రిడ్జిలు డ్రైనేజీలు, బీటీ రోడ్లు నిర్మించడం జరిగింది. ఇప్పటికీ ఇంకా కొన్ని రోడ్లు అభివృద్ధిలో నడుస్తున్నాయి. అదేవిధంగా విద్యుత్ సౌకర్యంతో పాటు వ్యవసాయక రంగం దిన దిన అభివృద్ధి చెందుతుంది. మండలంలో ఉన్న ప్రజలకు విద్య వైద్యం అందించాలనే లక్ష్యంతో రేగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చర్యలు చేపట్టారు. తాజాగా ఈ మండలానికి మరో కస్తూర్బా ఆశ్రమ పాఠశాల మంజూరు కావడం జరిగింది. సుమారు 7 కోట్ల రూపాయలతో కస్తూర్బా ఆశ్రమ పాఠశాల నిర్మాణం చేపట్టి పనులు చక చక జరగడంతో పాటుగా పూర్తయ్యేందుకు దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఆశ్రమ పాఠశాల పూర్తయితే గిరిజన కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్య సౌకర్యం కలగనుంది. ఇలా అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తున్న రేగా కాంతారావుపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
రేగన్న అడుగు పడింది.. పల్లె మారింది..
ఆళ్లపల్లి గ్రామంపై పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగన్న అడుగు పడడంతో పల్లె రూపురేఖలు మారిపోయాయని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం గమనించాల్సిన విషయం. కెసిఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈ ఆళ్లపల్లి గ్రామాన్ని మండలంగా మార్చి నలు దిక్కుల అభివృద్ధి చేయడంతో పాటుగా సేవల పట్ల గిరిజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రాంత గిరిజన కుటుంబాల పిల్లలకు అందుబాటులో విద్య ఉండాలనే ఉద్దేశంతో కొత్తగా కస్తూర్బా ఆశ్రమ పాఠశాల ఏర్పాటు త్వరితగతిన నిర్మాణం జరుగుతుండడం పట్ల పలు కుటుంబాలలో ఆనందం సంతోషం కనబడుతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !