బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వండి
బంగారు తెలంగాణ చేయడమే మా లక్ష్యం
బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షులు,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సమావేశం లో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ,కెసిఆర్ మళ్లీ గద్దనెక్కటానికి తన గారడి మాటలతో ఓట్లు దండుకోవడానికి మీ ముందుకు వస్తున్నారు అన్నారు.వారి అబద్ధపు వాగ్దానాలు నమ్మొద్దని రైతుబంధు వల్ల ఎవరు బాగుపడ్డారు,దళిత బంధు ఎవరు బాగుపడ్డారు, అని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ఈసారి ఇలాంటి గారడి మాటలు నమ్మి బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి మోసపోవద్దని వారు తెలిపారు.చేల్లని గ్యారెంటీ కార్డులతో కాంగ్రెస్ పార్టీ కూడా మీ ముందుకు వస్తున్నారని,ఈ పార్టీల కల్లబొల్లి మాటలు నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దు అన్నారు.బిజెపికి అవకాశం ఇస్తే,తెలంగాణ రాష్ట్రాన్ని, బంగారు తెలంగాణగా అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని,ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని తెలిపారు.ఒకసారి అవకాశం ఇస్తే,బంగారు తెలంగాణను చేసి చూపిస్తామని వారు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరిన కుటుంబాలను కండువా కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ రుక్మారావు,గరికపాటి మోహన్రావు ఎస్టీ నియోజకవర్గాల మెంబర్, మాజీ ఎంపీచాడ సురేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే నున్న శ్రీశైలం గౌడ్,జాడి దేవేంద్ర వరప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు, ఎట్టపల్లి శ్రీనివాస్,పొన్నం బిక్షపతి,జంపన,సీతారామరాజు,భూక్య సీతారాం నాయక్, కార్యకర్తలు,అభిమానులు,మహిళలు పాల్గొన్నారు.