మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ *మన్యం న్యూస్,ఇల్లందు:అన్నదానం మహా దానం అని ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు ఎల్బీఎస్ నగర్లో బొమ్మిసెట్టి శ్రీను ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విగ్నేశ్వరుడి ప్రత్యేకపూజా కార్యక్రమాల్లో మడత పాల్గొని వినాయక కమిటీకి 10వేల రూపాయలు అందించడం జరిగింది. తొలుతగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ..విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో పట్టణంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎల్బీఎస్ నగర్ యూత్ వారు మడతను శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏటూజెడ్ శ్రీను, సబ్బని సాయికుమార్, సైదులు, సైదమ్మ, అశోక్, కాంతారావు, నాగేంద్రచారి, మంగళ్ సింగ్, శివ, ముఫీద్ తదితరులు పాల్గొన్నారు.