మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
అన్నదానం కార్యక్రమం ఎంతో పవిత్రమైనదని ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత దానధర్మాలకు ఖర్చు పెట్టాలని కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం పాల్వంచలోని గణపతి మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాలను వనమా ప్రారంభించారు. పాత పాల్వంచ బిసిఎం రోడ్ లోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గౌండ్ల బజార్ లో శివనగర్ లో సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కే ఎస్ ఎం దాబా, నెహ్రు నగర్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలలో వనమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అన్నారు. గణపతిని పూజిస్తే ఎలాంటి విజ్ఞాలైనా తొలగిపోతాయన్నారు.
ఈ కార్యక్రమాల్లో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, కొత్వాల సత్యనారాయణ, కాల్వ ప్రకాశరావు, కాల్వ భాస్కర్ రావు, దాసరి నాగేశ్వరరావు, కందుకూరి రాము, సంతోష్ రెడ్డి, చిన్న పండు, బేతంశెట్టి వెంకట్, బందెల శ్రీనివాస్, దాబా శంకర్, వీరన్న, రాంబాబు నవభారత్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.