మన్యం న్యూస్,బూర్గంపాడు:
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత స్వగృహంలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య కు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండల ప్రజలందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత -రామ కొండ రెడ్డి దంపతులు, వారి కుమార్తెలు మహాలక్ష్మి, మైతిలి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, మహాలక్ష్మి మైథిలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్టాప్, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.