మన్యం న్యూస్,అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మల చెరువు గ్రామపంచాయతీ పరిధిలో లోతు వాగు పై హై లెవెల్ వంతెన నిర్మాణం సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తుమ్మలచెరువు ఎంపీటీసీ తాటి పూజిత తెలియజేశారు.చిన్న వర్షం పడ్డ వెంకటాపురం గ్రామపంచాయతీ,రామవరం భీమవరం ప్రజలు మొండికుంట నుండి వచ్చే రైతులకు కూడా వాగు దాటలేని పరిస్థితి,వాగు తగ్గిన తర్వాతే వెళ్ళవలసి వస్తుందని వారు తెలియజేశారు.తమ పంచాయతీ ప్రజలు పడుతున్న కష్టాలను పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుకి తెలియజేయగా సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో లోతు వాగు పై హై లెవెల్ వంతెన నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని అన్నారు.మారుమూల గిరిజన గ్రామాలైన తుమ్మలచెరువు,వెంకటాపురం, గొందిగూడెం గ్రామ పంచాయతీల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జరగబోయే ఎన్నికల్లో అభివృద్ధి ప్రదాత రేగా కాంతారావుని భారీ మెజారిటీతో గెలిపించుకొని మా గ్రామ పంచాయతీలను మరింత అభివృద్ధి చేసుకుంటామని వారు తెలియజేశారు.