మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయం గా ఉండే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత సంబంధిత బిఎల్ఓ లపై ఉందని భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ అన్నారు. ఆదివారం119 భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. మొత్తం 27 పోలింగ్ స్టేషన్లో గాను 20 పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించి పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల కొరకు ఏర్పాటుచేసిన సౌకర్యాలు అలాగే వికలాంగుల కొరకు ర్యాంపులు ఏర్పాట్లు ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్లో విద్యుత్ సౌకర్యం మంచినీటి సదుపాయం ఓటర్లు కూర్చునే విధంగా సౌకర్యాలు కల్పించాలని వర్షం వస్తే గనక తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే మెడికల్ క్యాంపు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. సంబంధిత బిఎల్వోలు ఇప్పటినుండే పోలింగ్ స్టేషన్లలో అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉన్నవి లేనివి తెలుసుకొని దానికి సంబంధించిన సమాచారం తమ కార్యాలయానికి తెలియజేయాలని అన్నారు. ప్రస్తుతం 20 పోలింగ్ స్టేషన్లో సౌకర్యాలు సంతృప్తి కారంగా ఉన్నాయని అన్నారు. ముందుగా చర్ల మండలంలోని జగన్నాధపురం పోలింగ్ స్టేషన్ మంచి సౌకర్యంగా ఉందని ఇదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిటి అపక రమేష్ సంబంధిత బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.