మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రజలు, యువతీ యువకులు అత్యంత భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులపాటు వైభవంగా నిర్వహించుకునే గణపతి నవరాత్రి ఉత్సవాలకు విద్యుత్ సరఫరాకు సంబంధించిన డిడిని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శనివారం రాత్రి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ హరిప్రియ ఫౌండేషన్ తరపున విద్యుత్ శాఖ డీఈ, ఏఈలకు రూ.50వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పట్టణంలోని ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక ఉత్సవాలకు విద్యుత్ వినియోగానికి సంబంధించి డీడీని చెల్లించడం ఆనందంగా ఉందన్నారు. విఘ్నేశ్వరుడి కరుణ, కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.