మన్యం న్యూస్,అశ్వాపురం: సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ వేదికగా సామాజికమాద్యమాలను సక్రమార్గంలో వాడుకోవాలి అని అశ్వాపురం సీఐ రవీందర్ సూచించారు.ఆయన సోమవారం అశ్వాపురం ఠాణా లో విలేకరులతో మాట్లాడారు. సోషల్ మీడియాలో ఇటీవలే కొంతమంది వ్యక్తులు యువకులు తమ ఇష్టార్జిన ఇతరులకు భంగం కలిగేలా పోస్టులు పెట్టడం జరుగుతుందని, ఇది వ్యక్తిగతంగా కించపరచడమే అన్నారు . ఇలాంటి పోస్ట్లు పెట్టే వారిపై పోలీస్ నిఘా పెట్టిందని ,ఇతరులకు ఇబ్బంది కలిగేలా.. వారి వ్యక్తిగతప్రతిష్టకు భంగం కల్పించేలా పోస్టింగ్ లు పెడితే కఠినచర్యలు తప్పవు అని సీఐ హెచ్చరించారు.