మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి జిల్లా కేంద్రం పరిధిలోని ఇల్లందు టేకులపల్లి మండలంలో అంగన్వాడి సెంటర్లను సోమవారం జిల్లా సంక్షేమ అధికారిని వేల్పుల విజేత ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఉన్న స్టాక్ వివరాలను పరిశీలించారు. లబ్ధిదారులకి పౌష్టికాహారం అందజేస్తున్నారా లేదా అని అక్కడున్న రికార్డులను తనిఖీ చేశారు. సూపర్వైజర్లకు పలు సూచనలు చేశారు. తప్పనిసరిగా అందరు లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించాల్సిన బాధ్యత వారిపై ఉన్నదని అన్ని అంగన్వాడి సెంటర్లలో పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా అందజేయాలని సూపర్వైజర్స్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న, సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు.