మన్యం న్యూస్,పినపాక:పినపాక బీ. ఆర్.ఎస్ అభ్యర్థి, రేగా కాంతరావు గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచెయ్యాలి అని ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య పిలుపునిచ్చారు.
బీ. ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామపంచాయతీ పరిధిలోని పార్టీ బూతు నెంబర్ 58 లో కోఆర్డినేటర్ పటేల్ కామేశ్వరరావుఆధ్వర్యంలో 100 ఓట్లకు ఒక ఇన్చార్జిని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన వారికి తగు సూచనలు ఇచ్చి దిశా నిర్దేశం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ల్ బూత్ ఇన్చార్జి ఇరప సాంబశివరావు, ఇరప చిరంజీవి , కొమరం నాగేశ్వరరావు, జిమ్మిడి సుమన్ , పోలేబొయిన నవీన్ కుమార్, దబ్బగట్ల సత్యం, జాడి కిరణ్, దాట్ల మోహన్ రావు, గొంది నరసింహారావు ,పోలిబోయిన సురేందర్ ,బంగారు అశోక్ ,బట్ట సతీష్ ,శాఖమూడి అరుణతదితరులు పాల్గొన్నారు.