మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలంలోని మామిడిగూడెం, కొమ్ముగూడెం, మిట్టపల్లి, రోoపేడు, విజయలక్ష్మి నగర్, మామిడి గుండాల, ఒడ్డుగూడెం, చల్ల సముద్రం, ఇందిరానగర్, గ్రామపంచాయతీ లలో 4.67 కోట్ల రూపాయల డిఎంఎఫ్ టి, ఇజిఎస్, యస్ డిఎఫ్ నిధులతో మండల వ్యాప్తంగా సీసీ రోడ్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, నూతన పంచాయతీ భవనాల శంకుస్థాపన పనులు చేసిన ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయక్ అభివృద్ధి పనులలో బాగంగా సోమవారం మమిడిగుండాల గ్రామ పంచాయితీలో 1.70 కోట్ల డిఎంఎఫ్ టి నిధులతో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు నూతన గ్రామ పంచాయితీ భావన నిర్మానం కోసం శంకుస్థాపన చేశారు. రొంపేడు గ్రామ పంచాయితీ లో 35 లక్షల డిఎంఎఫ్ టి నిధులతో 8 అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.మిట్టపల్లి లో 11 లక్షల తో 4 అంతర్గత రోడ్ల కోసం శంకుస్థాపన చేశారు. విజయలక్ష్మి నగర్ పంచాయితీలో 5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బోటి గూడెం, చల్లసముద్రం గ్రామపంచాయతీ లలో 40 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే హరిప్రియా మాట్లాడుతూ పల్లెలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యం అవుతుందన్నారు. సీఎం కెసిఆర్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం వివిధ రకాల అభివృద్ధి పథకాల రూపకల్పన చేస్తూన్నారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఉమాదేవి, దాస్యం ప్రమోద్ కుమార్, బండారి శ్రీను, మండల అధ్యక్షులు శీలం రమేష్ , ఖమ్మంపాటి రేణుక, సర్పంచులు తాటి మౌనిక, కుంజ కృష్ణ, కృష్ణ, తాటి చుక్కమ్మ, గుగులోతు అంబాలి, అజ్మీర్ శంకర్, చాట్ల భాగ్యమ్మ, పూణెం కవిత, లస్కర్, పూణెం కమల, బండి శ్రీను, బింగి వెంకన్న, మూడు హనుమ, బానోతు రమేష్, భూక్యనందు, బానోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు,