మన్యం న్యూస్ ,పినపాక:
విద్యార్థి దశలోనే ఎన్నికల విధానంపై అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో చంద్రశేఖర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …ఎన్నికల విధానంపై విద్యార్థులకు అవగాహన,
ఓటరుగా నమోదు ఓటు హక్కు వినియోగంపై విద్యార్థుల చేత వారి కుటుంబాల భాగస్వామ్యం పెంపొందించేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందన్నారు. భవిష్యత్ ఓటర్లు, నూతన ఓటర్లుగా ఉన్న యువత ప్రజాస్వామిక ఎన్నికల విధానం, అవశ్యకతపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం తాసిల్దార్, ఎంపీడీవోలను కళాశాల సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు, కళాశాల అధ్యాపకులు, తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.