రేగా బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రక్తదానం
అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న:రేగా సుధారాణి
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మున్సిపాలిటీ పరిధి లోని బాపనకుంట గ్రామానికి చెందిన చీమల భద్రమ్మా అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ, బ్లడ్ తక్కువగా ఉందని, బాధితురాలకు AB పాజిటివ్ బ్లడ్ అవసరం అని,బాధితులు రేగా బ్లడ్ బ్యాంకు ను సంప్రదించగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ రేగా కాంతరావు సతీమణి రేగా సుధారాణి వెంటనే స్పందించి రేగా బ్లడ్ బ్యాంకు సభ్యులు సతీష్ నాగరాజుతో మాట్లాడి వెంటనే రక్తదానం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. రక్తదానం అనంతరం రేగా సుధారాణి మాట్లాడుతూ,అన్ని దానాలలో కన్న రక్తదానం చాలా గొప్పదన్నారు.రక్తం అనేది కృత్రిమంగా ఉత్పత్తి చేయబడదని,రక్తదానం చేయడం అంటే మరొకరికి ప్రాణదానం చేయడమేనని వారు తెలిపారు.ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా,ఎటువంటి సమయం లో అయినా,ఏ గ్రూప్ బ్లడ్ కొరకు అయినా సరే రేగా బ్లడ్ బ్యాంకు ను సంప్రదించాలని హాస్పిటల్ మేనేజ్మెంట్ కు రేగా సుధారాణి సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీసీ రేగా రవి,సుజిత,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి రాము,నాగేళ్లి గోపి,రేగా సోషల్ మీడియా వారియర్ గుంటక ప్రవీణ్,డేగల సంపత్ కుమార్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.