మన్యం న్యూస్,మణుగూరు:
హైదరాబాద్ సెక్రటేరియట్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా పర్యటనకు రావాలని కేటీఆర్ ని ఆహ్వానించారు. అనంతరం మణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధి నిమిత్తం , నియోజకవర్గ అభివృద్ధితో పాటు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో అభివృద్ధి నిమిత్తం నిధులు విడుదల చేయాలని కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ గారు స్థానికులంగా స్పందించి పర్యటనకు వస్తాను నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చినట్లు రేగా కాంతారావు తెలిపారు.