అంగన్వాడీ కేంద్రాలలో పాలు ,పప్పు, గుడ్లు పంపిణీ
మన్యం న్యూస్, వాజేడు:
జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి, ఆదేశాల ప్రకారం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ శిరీష, అదనప సిడిపిఓ ముత్తమ్మ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో సోమవారం వాజేడు మండలంలోని పేరూరు సెక్టార్ల పరిధిలో సమ్మెలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను, ఆయా కేంద్రాల పరిధిలో లబ్ధిదారులను పిలిపించి లబ్ధిదారులకు పాలు, గుడ్లు, పప్పు, బియ్యo సరుకులను అందించారు.అంగన్వాడి టీచర్లు, ఆయాలు కొన్ని రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న కారణంగా పిల్లలకి, గర్భిణీలకు, బాలింతలకు, అందించవలసిన పోషక పదార్థాలను అంగన్వాడీ కేంద్రాలలో ఉండిపోయాయని కలెక్టర్ ఆదేశాల మేరకు పంపిణీ చేసినట్లు సిడిపిఓ శిరీష తెలిపారు.
గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, గ్రామైక్య మహిళా సంఘాల సభ్యులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, సఖి కేంద్రం సిబ్బంది, బాలసదనం సిబ్బంది మరియు ఉమెన్ హబ్ సిబ్బంది పాల్గొన్నారు.