మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం కేశవాపురం గ్రామపంచాయతీలోని రాళ్లగూడెం గ్రామంలో సోమవారం ప్రధాన రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో త్రాగు నీరు కోసం నిరసన చేశారు. గత పది రోజులనుంచి మంచినీళ్ల రావడం లేదని
ఆందోళన దిగారు. గ్రామ మహిళలు,గ్రామస్తులు పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. తమ గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ మహిళలు ఖాళీ
బిందెలతో రోడుపై బైఠాయించారు.సమస్యను పరిష్కరించడంలో
అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయడం సరికాదని, తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంచినీరు లేక తీవ్రమైన ఇబ్బందులుప డుతున్నామంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే ఈ నిరసనను తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని మహిళలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.