మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా పాల్వంచ రూరల్ మండలం పాల్వంచ మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వినాయకున్ని వేడుకున్నారు. పలు మండపాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు ఆలయ మర్యాదలతో పొంగులేటిని ఘనంగా సత్కరించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూకంటి గోపాలరావు, నాగ సీతారాములు, మచ్చా శ్రీను, ఆళ్ల మురళి, తూము చౌదరి, నాగేంద్ర త్రివేది, జానకీ రెడ్డి, యర్రం శెట్టి ముత్తయ్య, శివారెడ్డి, ఆకునూరి కనకరాజు, లక్కినేని సాయి, కలకోటి రాజు, మోహన్, వి.రవి, నవీన్, నిరంజన్ రెడ్డి, సతీష్, వి.రాంబాబు, రవిగౌడ్, పెంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.