మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తమ సమస్యలను పరిష్కరించాలని మధ్యాహ్నం భోజన కార్మికులు చేస్తున్న సమ్మె సోమవారం నాటికి ఆరవ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని కోరుతూ కార్మికులు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న ఏఐటీయూసీ రాష్ట కార్యదర్శి నరాటి ప్రసాద్ మాట్లాడుతూ వంట కార్మికుల సమ్మె సందర్భంలో ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసినట్లు తెలిసిందని ఆ బడ్జెట్ వంట కార్మికుల ఖాతాలలో జమ అయ్యేవరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి దసరా నుండి అల్పాహారం అందిస్తామని ప్రకటించడం జరిగిందని ఈ వంట చేయాలంటే కార్మికులు ఉదయం 7 గంటలకే పాఠశాలలు రావాల్సి ఉంటుందని తెలిపారు. కార్మికుల కష్టాన్ని గుర్తించి వారికి సకాలంలో వేతనాలు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు మామిడిచెట్టి కోటి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పూర్ణ, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షలు దాసుల పుష్పవతి, కార్యదర్శి విజయ లక్ష్మి, రాధ, ప్రభావతి, మంగ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.