UPDATES  

 పుసుగుప్ప రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి.

పుసుగుప్ప రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి.
తునికాకు బోనస్, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని
ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయం ముందు ధర్నా
*ఐటీడీఏపీవో కు వినతి

మన్యం న్యూస్,చర్ల:
చర్ల మండలం పుసుగుప్ప గ్రామం లో వేస్తున్న రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని, రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ రాంబాబు పై చర్యలు తీసుకోవాలని, తునికాకు బోనస్, పెండింగ్ లో ఉన్న పోడు పట్టాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల కార్యదర్శి కారం నరేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పుసుగుప్ప గ్రామస్తులతో కలిసి సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ పీవో కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులపై అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.దీని వల్ల సంవత్సరాల తరబడి రోడ్డు పనులు పూర్తి కాకుండా ఉంటున్నాయని మారుమూల ఆదివాసీ గ్రామమైన పుసుగుప్ప లో కాంట్రాక్టర్ రోడ్డు మొత్తం తవ్వి మద్యలో పనులు ఆపేశాడని దీంతో గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్,సంబందిత అదికారుల పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు, సిపిఎం మండల కమిటీ సభ్యులు దొడ్డి హరినాగవర్మ మాట్లాడుతూ పుసుగుప్ప గ్రామప్రజలు ప్రతి సంవత్సరం తునికాకు సేకరిస్తారని వారికి 2016 సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న బోనస్ డబ్బులు ఫారెస్ట్ అధికారులు చెల్లించక పోవడం దారుణమని అన్నారు. ఆదివాసులను మోసం చేయాలని చూస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు, నలభై ఆరు మంది ఆదివాసులకు పోడు పట్టాలు ఇవ్వలేదని వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రామకృష్ణ, ధర్మయ్య, ప్రదీప్, రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !