మన్యం న్యూస్ బూర్గంపహడ్:-చర్ల మండలం జిపిపల్లి గ్రామానికి చెందిన కే నాగేశ్వరరావు డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ రక్త కణాల సంఖ్య 33 వేలకు పడిపోయి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఎమర్జెన్సీగా రక్తం ఎక్కించాలని సూచించారు.నాగేశ్వరరావు యొక్క బ్లడ్ గ్రూప్ అరుదైన బి నెగిటివ్ కావడంతో బ్లడ్ దొరకక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ కి రావడంతో వెంటనే స్పందించి ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు మన తెలంగాణ రిపోర్టర్ మహేశ్ అరుదైన బి నెగిటివ్ బ్లడ్ ను స్థానిక రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు రక్త దానం చేయించి పేషెంట్ ను ఆదుకున్నారు.ఈ సందర్భంగా రక్తదాతకు ట్రస్ట్ నిర్వాహకులు బంధువులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.