మన్యం న్యూస్ ,బూర్గంపహడ్:తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు ప్రత్యేక చొరవ తో బూర్గంపహడ్ మండలంతో పాటు సారపాక పట్టణాభివృద్ధికి పెద్ద పీఠ వేశారు. మండలం లోని ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం తో అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు మంజూరు చేస్తూ,విడుదల చేసిన నిధులతో గ్రామాల్లో,పట్టణాల్లో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేపట్టి అభివృద్ధి బాటలు వేస్తు,ప్రధానంగా తాళ్ళగోమ్మురు గ్రామ పంచాయతిలో లక్షలు విలువైన సీసీ రోడ్లతో పాటు పలు అభవృద్ధి పనుల కు నిధులు మంజూరు చేసి,ప్రధానంగా మండలంలో ఏక్కడ లేని విధంగా తాళ్ళ గొమ్మురు గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణంకి రేగా చేసిన కృషినీ మరచిపోలేమనీ ప్రజలు మన్యం న్యూస్ కి తెలిపారు.స ఎమ్మెల్యే రేగా కాంతరావుకి మండల ప్రజలతో పాటు తాళ్ళగోమ్మురు గ్రామ పంచాయతీ ప్రజలు సైతం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రేగా కి రుణపడి ఉంటాం అని అన్నారు.