మన్యం న్యూస్, అశ్వాపురం:అశ్వాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న ఆనందాపురం గ్రామవాసి వల్లపు గోపి 35 (సంవత్సరాలు) అనేవ్యక్తి గత 20 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి కష్టకాలంలో ఉన్న విషయాన్ని తెల్సుకున్న 2002-2003 సంవత్సరంలో అశ్వాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గోపి తో పాటు 10వ తరగతి చదువుకున్న స్నేహితులంతా వారికి తోచిన సహాయం చేసేందుకు ముందుకువచ్చారు.అందరి భాగస్వామ్యంతో 25 వేల రూపాయలు పోగుచేసి తమ బాల్య మిత్రుని కుటుంబానికి అండగా నిలిచారు.గోపి భార్య అయిన చంద్రకళకు ఈమొత్తాన్ని సోమవారం అందజేసి బాల్య స్నేహితుని పై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపేందర్, ప్రతాప్,అలవాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.