మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణ ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఇల్లందులో కోరం కనకయ్య ఆధ్వర్యంలో చేపట్టిన గడపగడపకూ కాంగ్రెస్ పార్టీ రెండోవిడత ప్రచార కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. తొలుతగా ఇల్లందు మండలం సుభాష్ నగర్ గ్రామపంచాయతీలో గల జానకీకోదండ రామాలయం నందు మండల కాంగ్రెస్ పార్టీనేతల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేకపూజా కార్యక్రమాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య పాల్గొన్నారు. అనంతరం సుభాష్ నగర్ గ్రామపంచాయతీలో గడపగడపకూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా రాబోవురోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇండ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి స్థలంతో పాటుగా ఐదులక్షల రూపాయలు కేటాయిస్తామని తెలిపారు. అదేవిధంగా పదిలక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాపథకం, చేయూత, గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతుభరోసా, యువవికాసం పథకాల ద్వారా రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ రాబోవు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని తెలియజేశారు. అన్నివర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కనకయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు దొడ్డ డానియల్, పులి సైదులు, మండల ప్రధాన కార్యదర్శి ఆరెం కిరణ్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎదళ్ళపల్లి అనసూర్య, మండల సర్పంచులు పాయం స్వాతి, కల్తీపద్మ, పాయం లలిత, తాటి చుక్కమ్మ, ఛాట్ల భాగ్యమ్మ, ఎంపీటీసీలు మండల రాము, పూనెం సురేందర్, పాయం కృష్ణప్రసాద్, తాటియశోద, ఉప సర్పంచులు నరసింహారావు, తాటి రాంబాబు, మాజీ ఎంపీటీసీ దన్సింగ్ నాయకులు బానోత్ శారద, రమాదేవి, ఊరుగొండ ధనుంజయ్, రావూరి సతీష్, బియ్యని సుధాకర్, బానోత్ శంకర్, మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, చిల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.