మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఏర్పాటుచేసిన గణనాథుడు వద్ద నిర్వాహకులు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని గుండాల ఎంపీపీ సత్యం, వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు కోడూరి శ్యామ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మండల కేంద్రంలోని అన్ని వర్గాల గణనాధుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు సుభాష్ నగర్ గణనాథుడు వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని దాతలుగా మోతి చిన్న, సుధా దంపతులు ఆధ్వర్యంలో కమిటీ వారు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తీగల ముఖేష్, సమ్మయ్య, సురేష్, రమేష్, రాము, శ్రీను, శ్రీను తదితరులు పాల్గొన్నారు