మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలోని రామాలయం వద్ద ఉన్న గణనాథుడి వద్ద నిర్వాహకులు సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు మానాల వెంకటేశ్వర్లు, ఇల్లందుల అప్పారావు, మానాల ప్రభాకర్, కోడూరి శ్యామ్ ప్రారంభించారు. ఈ సంవత్సరం గణనాథుడి వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం మణికంఠ జ్యువెలర్స్ యజమాని కదిరి శ్రీనివాస్ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించరు. ఈ కార్యక్రమంలో కమిటీ యాసారపు రవి, మానాల శ్రవణ్ కుమార్, యాసారపు సురేష్, మానాల ప్రణీత్ కుమార్ ,లక్ష్మీనారాయణ, వంశీ, రాంబాబు, వెంకటేశ్వర్లు, శ్రీశైలం, శరత్ కుమార్, పూజిత్, శ్రీనివాస్, సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు