UPDATES  

 బి.ఎస్.ఎస్.ఎం చైర్మన్ మద్దిశెట్టి శామ్యూల్ ఘరాన మోసం

బి.ఎస్.ఎస్.ఎం చైర్మన్ మద్దిశెట్టి శామ్యూల్ ఘరాన మోసం

*పోలీసు స్టేషన్ కి పరుగులు పెడుతున్న శామ్యూల్ బాధిత ఆదివాసీలు
*రోజురోజుకు పెరుగుతున్న మద్దిశెట్టి మోసాలు.
*లక్షలు దండుకున్న మద్దిశెట్టి పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
మన్యం న్యూస్ ,ములకలపల్లి: (సెప్టెంబర్ 25):పోడు భూములకు పట్టాలు ఇస్తాం,ఇల్లు ఇప్పిస్తాం,గుళ్ళు కట్టిస్తాం, ప్రహరీ గోడ ,బోరు పెట్టిస్తా ప్రభుత్వం గిరిజన పూజారులకు నెల నెలా జీతాలు ఇప్పిస్తాం , డిడి కడితే ప్రతి ఒక్కరికి పది లక్షల వస్తాయి అని రకరకాల మాయ మాటలు పేరుతో నిలువు దోపిడీ చేసిన దమ్మపేట మండలం సరోజనపురం గ్రామానికి చెందిన బి.ఎస్.ఎస్.ఎం చైర్మన్, ఆర్.పి.ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిసెట్టి శామ్యూల్ పై గుట్టగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు స్థానిక స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధిత వ్యక్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని చాలా తెలివిగా,చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా అక్రమ కార్యక్రమాలు, అక్రమ హామీలు ఇస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్నాడని భాధితులు తెలిపారు. మధ్ధిసెట్టి సామ్యూల్ ఎక్కడ కనపడ్డ ఆదివాసి సంఘాలకు సమాచారం ఇవ్వాలని, బాధితులు,మధ్యవర్తులు బయటకు వచ్చి పిర్యాదు చేయడం ద్వారా మరో చోట ఆదివాసీలు మోస పోకుండా ఇఇలాంటి వారి పట్ల జాగ్రత్త గా ఉండాలని, ఇంకా ఎవరైనా బాధితుల ఉంటే ఫిర్యాధు లు చేయండని ఆదివాసి సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ కార్య క్రమంలో ఆదివాసి సేన రాష్ట్ర సహాయ కార్యదర్శి ఊకె రవి,బాధితులు కోటేష్,వెంకటేష్,ఆదివాసి సేన నాయకులు సోడే శ్రీను,కీసరి నాగేష్,కట్టం రమేష్, కొర్రి కిరణ్, కొర్రి శివ,మడివి చంద్రం,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !