నేడు జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం
* సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండుపై మంగళవారం సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు. సోమవారం శేషగిరిభవన్లో అయన మాట్లాడుతూ ఇండ్ల స్థలాలకు జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాలు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వం జిల్లా అధికారులు స్పందించడం లేదని అన్నారు. జర్నలిస్టులకు మంజూరు చేసేందుకు ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ వారిపట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారని అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామని తెలిపారు. సమావేశానికి వామపక్ష, విపక్ష పార్టీలు, ప్రజా సామాజిక, కార్మిక సంఘాలను, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను అహ్వాహించినట్లు సాబీర్ తెలిపారు.