మన్యం న్యూస్ , హైదరాబాద్:
పర్యావరణహిత మట్టి గణపతిని పూజించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. ఆంధ్రప్రభ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రులను పురస్కరించుకొని మంగళవారం నిర్వహించిన పూజా కార్యాక్రమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రభ యాజమాన్యం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులను అత్యంత ఆనందకరమైన వాతావరణంలో నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు, దేశ ప్రజలు మరింత ఆనందాన్ని, సుఖ సంతోషాలను పొందేలా దీవించాలని గణనాథుడిని పూజించినట్లు తెలిపారు. . ఈ సందర్భంగా ఆంధ్రప్రభ మేనేజింగ్ డైరెక్టర్ ముత్తా గౌతమ్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, జనరల్ మేనేజర్(నెట్‌వర్క్) పసునూరి భాస్కర్‌లు రేగా కాంతారావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్(మార్కెటింగ్) గంజి వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్(ఐటీ) శీనయ్య, ఉభయ రాష్ట్రాల ఇన్‌చార్జి (న్యూస్) మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.